జూలై 21 నుండి జియో యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రారంభం కానున్నది యూజర్స్ పూర్తిగా వినియోగించండి - myblog-mksha

Tuesday, July 17, 2018

జూలై 21 నుండి జియో యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రారంభం కానున్నది యూజర్స్ పూర్తిగా వినియోగించండి


రిలయన్స్ జీయో యొక్క వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ జీయో ఫోన్ మాన్సూన్ హంగామా పేరుతొ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు వారి పాత ఫీచర్ ఫోన్లను మార్పిడి చేసుకుని ఒక కొత్త ఫీచర్ ఫోన్ ను ఎక్స్చేంజ్లో కేవలం రూ. 501 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. జూలై 21 నుండి వినియోగదారులు ఈ ఆఫర్ను పొందగలుగుతారు. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దేశంలో లక్షలాదిమంది ప్రజలు ఇప్పటికీ పాత ఫీచర్ ఫోన్లను ఉపయోగించుకుంటున్నారు, వారు ఇంటర్నెట్ విప్లవం నుండి చాలా దూరంగా ఉన్నారు. దీని ద్వారా వినియోగదారులను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ జియో ఫోన్ యొక్క ధరను రూ.1500 నుండి 501 రూపాయలకు తగ్గించామని చెప్పారు.


జీయో ఫోన్ మాన్సూన్ ఆఫర్ ద్వారా వినియోగదారులు పాత ఫీచర్ ఫోన్లను మార్పిడి చేసి ప్రయోజనాలను పొందగలుగుతారు. బదులుగా వారికీ రూ.501  మాత్రమే కొత్త ఫీచర్ ఫోన్ ను లాభయం అవుతుంది. ఈ ఫోన్ KaiOS పై పనిచేస్తుంది, పలు స్మార్ట్ ఫీచర్లతో కలిగియున్నది. దీనిలో 4జి కనెక్టివిటీ కూడా ఉంది, దీనితో, జియో ఫోన్ యూజర్ Whatsup ఆగస్టు 15 నుండి YouTube మరియు Facebook వంటి సోషల్ మీడియా ఆప్స్ లను కూడా ఉపయోగించవచ్చు.

జీయో ఫోన్ ఫీచర్స్ గురించి చర్చిస్తే దీనిలో వినియోగదారులకు ఒక 2.4 అంగుళాల QWVGA తో  కూడిన డిస్ప్లే, దీనిలో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో మాలి -400 GPU ఇంట్రెగటెడ్ ఉపయోగించ బడినది. ఈ ఫోన్ 512 ఎం బి ర్యామ్ మరియు 4జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిఉంది, మైక్రో ఎస్ డి కార్డు సహాయం తో స్టోరేజ్ కెపాసిటీ ని 128జిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది, దీని బ్యాక్ ప్యానెల్లో 2 మెగా పిక్సల్స్ తో కూడిన మరియు ఫ్రంట్ లో వి జి ఏ కూడిన కెమెరా అమర్చ బడింది. ఈ హ్యాండ్సెట్లో 2000 mAh  పవర్ కలిగిన బాటరీ ఉంది, కంపెనీ క్లెయిమ్ ప్రకారం12 గంటల వరకు టాక్ టైమ్ మరియు స్టాండ్బై టైమ్ 15 రోజుల వరకు ఉంటుంది. ఈ ఫోన్ 22 భారతీయ భాషలకు సపోర్ట్  చేస్తుంది. ఈ ఫోన్లో లైవ్ సినిమా జియో మ్యూజిక్ జియో TV మరియు జియో ఎక్స్ప్రెస్ వార్తలు వంటి ఆప్స్ ఇంబిల్ట్ చేయబడ్డాయి. దీని కనెక్టివిటీ లో 4 జి, బ్లూ టూత్ , వైఫై , ఎఫ్ ఎం రేడియో , జి పి ఎస్ , మరియు యూ ఎస్ బి  సపోర్ట్ లాంటి ఫీచర్స్ కలిగిఉంది.

No comments:

Post a Comment