నోకియా
3.1 మాస్కోలో మొదటిసారిగా మే నెలలో
లాంచ్ చేయబడినది, ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. HMD గ్లోబల్ నోకియా దేశంలో
తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్ను అధికారికంగా లాంచ్ చేసింది. నోకియా స్మార్ట్ఫోన్
యొక్క ప్రధాన ముఖ్యాంశాలు దాని యొక్క స్టాక్ ఆండ్రాయిడ్ వన్ సర్టిఫికెట్, 18:
9 HD+ ప్యానెల్ మరియు 2,990mAh బ్యాటరీ.
ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమంలో భాగంగా, నోకియా 3.1 మూడు
సంవత్సరాల నెలవారీ సెక్యూరిటీ ప్యాచ్లు మరియు రెండు సంవత్సరాల మేజర్ OS నవీకరణలను
విడుదల చేయనుంది. కంపెనీ మాస్కో ఈవెంట్లో మే, 2018
లో మూడు ఫోన్లను ప్రకటించింది - నోకియా 2.1, నోకియా
3.1, మరియు నోకియా 5.1.
భారతదేశంలో
నోకియా 3.1 ధర రూ. 10,499, 2
జి బి ర్యామ్ / 16
జి బి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇది
భారతీయ మార్కెట్లకు వస్తున్న ఏకైకది. ఇది బ్లూ / కాపర్, బ్లాక్
/ క్రోమ్ మరియు వైట్ / ఐరన్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది మరియు
జులై 21 నుండి మెయిన్ మొబైల్ రిటైలర్స్ మరియు పే టి ఎం మాల్ మరియు నోకియా యొక్క
ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆన్లైన్లో ఫోన్ను విక్రయిస్తారు. Paytm మాల్ పై ఆఫర్లను ప్రారంభించింది, Paytm
మాల్ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా
ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ నుండి నోకియా 3.1 కొనుగోలు చేసే వినియోగదారులకు Paytm పై తదుపరి రీచార్జ్లు మరియు బిల్లు చెల్లింపులకు 10
శాతం క్యాష్ బ్యాక్ కు అర్హులు.
స్మార్ట్ఫోన్ కొనుగోలో
కస్టమర్స్ రూ.250 మూవీ క్యాష్ బ్యాక్ వోచర్లకు అర్హులు, వీటిని రెండు మూవీ
టికెట్స్ బుకింగ్ తో పే టి ఎం లో రీడీమ్ చేసుకోవచ్చు. చివరగా ఐసీఐసీఐ బ్యాంకు
క్రెడిట్, డెబిట్ కార్డులు 5 శాతం క్యాష్
బ్యాక్కు కొనుగోలు పై పొందుగలరు. టెలికాం ఆఫర్ల విషయంలో, ఐడియా
మరియు వొడాఫోన్ వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుగలరు.
నోకియా 3.1 స్పెసిఫికేషన్స్ :
నోకియా 3.1 ఆండ్రాయిడ్
వన్ ఆధారిత ఒరియో పనిచేస్తుంది మరియు ఒక 18: 9 ఆస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా
గ్లాస్ ప్రొటెక్షన్తో 5.2-అంగుళాల HD + (720x1440 పిక్సల్స్) డిస్ప్లే
కలిగిఉంది. ఇది ఆక్ట్ కోర్ మీడియా
టెక్ MT6750N 1.5GHz ప్రోసెస్సేర్ కలిగిఉంది,
2GB / 3GB RAM మరియు 16GB / 32GB eMMC 5.1 స్టోరేజ్ మరియు
మైక్రో SD కార్డు సహాయం తో దీనిని 128 జి బి వరకు పెంచవచ్చు.
నోకియా
3.1 ఒక 13 మెగాపిక్సెల్ ఆటోఫోకాస్ సెన్సార్ను f / 2.0
మరియు ఒక LED ఫ్లాష్ తో కలిగి ఉంటుంది.
సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం,
ఈ హ్యాండ్సెట్ లో 8 మెగా పిక్సల్స్ తో కూడిన ఫిక్స్డ్ ఫోకస్ సెన్సర్ తో f / 2.0
ఆపెర్చర్ మరియు 84.6-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో ఉంది. 2,990mAh పవర్తో
కూడిన బాటరీ హుడ్ కింద అమర్చబడినది.
నోకియా
3.1 కనెక్టువిటీ గురించి చెప్పాలంటే దీనిలో4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్
v5.0, GPS / A-GPS, GLONASS, మైక్రో- USB మరియు
3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. దీనిలో
లో యాక్సలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్
మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ సైజు146.25x68.65x8.7mm మరియు
సుమారు138.3 గ్రాముల బరువు ఉంటుంది.
No comments:
Post a Comment