టీజర్ రిలీజ్ ప్రకారం నోకియా X6 గ్లోబల్ వేరియంట్ మొట్టమొదటిసారిగా తైవాన్లో లాంచ్ అవుతుంది. - myblog-mksha

Thursday, July 19, 2018

టీజర్ రిలీజ్ ప్రకారం నోకియా X6 గ్లోబల్ వేరియంట్ మొట్టమొదటిసారిగా తైవాన్లో లాంచ్ అవుతుంది.



నోకియా X6 చాలా కాలం క్రితం చైనాలో లాంచ్ చేయబడినది, కానీ ప్రతి ఒక్కరూ దాని గ్లోబల్ రోల్అవుట్ కోసం వేచి ఉన్నారు. నోకియా X6 యొక్క గ్లోబల్ వేరియంట్ను జూలై 19 న హాంకాంగ్ లో లాంచ్ అయ్యే వార్త మొదట వచ్చింది. వాస్తవానికి నోకియా X6 యొక్క వేరియంట్ ను పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ మార్కెట్ తైవాన్ తైవాన్ అని ఇప్పుడు తెలిసింది, నోకియా యొక్క అధికారిక ఫేస్ బుక్  పేజీలో ఒక టీజర్ పోస్ట్ చేయబడింది, అందులో నోకియా X6 హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ వన్ బ్రాండ్తో కనిపిస్తుంది. ఈ ఫోన్ నోకియా 6.1 ప్లస్, ఆండ్రాయిడ్ వన్ తో కూడా పిలవబడుతుంది.
ఫేస్బుక్ థ్రెడ్లో పోస్టింగ్ చేయడం కూడా నోకియా 6.1 ప్లస్ పేరును  సూచిస్తుంది. ఈ పోస్ట్ లోని సమాచారం కూడా తైవాన్లో ఈ సీజన్లో నోకియా X6 ను తీసుకురావడంపై నే ఉంది. మన దేశానికి ఈ హ్యాండ్సెట్ ఎప్పటి వరకు రావచ్చు అనే సమాచారం ఇప్పటికి అందలేదు, కానీ నోకియా X6 భారతీయ మార్కెట్ కి చాల దూరంగా లేదు.

ఆలోచించ దగ్గ  విషయం ఏమిటంటే నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ హెచ్ఎండి గ్లోబల్ గురువారం నోకియా 3.1 ను విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 2 జీబి ర్యామ్ మరియు 16 జీబి మెమరీ వేరియంట్స్ రూ .10,499. జూలై 21 pay t m మాల్ మరియు నోకియా యొక్క సొంత వెబ్ సైట్ లో దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Nokia X6 యొక్క స్పెసిఫికేషన్స్:
డ్యూయల్ సిమ్ (నానో) నోకియా X6 ఆండ్రాయిడ్ 8.1 ఓరియోలో నడుస్తుంది. ఇది 5.8 అంగుళాల పూర్తి HD+ (1080x2280 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. హ్యాండ్సెట్లో 1.8 గిగాహెట్జ్ ఎక్ట-కోర్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4 జీబి ర్యామ్ లేదా 6 జీబి ర్యామ్. నోకియా X6 డ్యూయల్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ సెన్సార్ 16 మెగా పిక్సల్స్ మరియు రెండవ సెన్సార్ 5 మెగా పిక్సల్స్ తో. ఫ్రంట్  ప్యానెల్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మంచి ఫోటోగ్రఫీ కోసం AI ఫీచర్ ఇవ్వబడింది, ఇంటర్నల్  స్టోరేజ్ 64జిబి కలిగి ఉంది, అవసరం అయితే దీనిని ఎస్ డి కార్డు సహాయంతో 128జిబి వరకు పెంచవచ్చు.

నోకియా X6 యొక్క కనెక్టివిటీ ఫీచర్లు 4G VoLTE, Wi-Fi 802.11 AC, బ్లూటూత్ 5.0, GPS / A-GPS, 3.5mm హెడ్ఫోన్ జాక్ మరియు USB టైప్- C పోర్ట్. 3060 mAh బ్యాటరీ హ్యాండ్ సెట్లో ఉంది. ఇది 18 వాట్ ఛార్జర్తో వస్తుంది. ఇది 30 నిమిషాల్లో ఫోన్ యొక్క బ్యాటరీలో 50 శాతం ఛార్జ్ చేస్తుంది. ఇవిదమైన ఛార్జ్ క్విక్ ఛార్జ్ 3.0 వలన సాధ్యం అవుతుంది. ఈ హెడ్ సెట్ యొక్క డైమెన్షన్ 147.2x70.98x7.99 మిల్లీమీటర్లు ఉంది.


No comments:

Post a Comment